Logo
Search
Search
View menu

Matruvandanam

E-Books | Telugu

Every birth comes from pain, an unbearable pain for a woman, during pregnancy. Vedavyasa, in the ""Vayu Purana,"" describes in detail the journey of a woman as she prepares for this battlefield, sacrificing herself to create the necessary conditions for an embryo to grow inside her. It's a joy in pain that transforms a woman into a mother. Changanti Koteswara Rao, an eminent Telugu speaker on Sanatana Dharma, has simplified 16 Slokas from Vayu Purana, which have been illustrated by the legendary artist Bapu. This book is an excellent resource for understanding the greatness of motherhood. Download and enjoy the book!

"అవతారమూర్తి అయినా, అణువంతే పుడతాడు. అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు" అని సిరివెన్నెల గారు రాసినట్టు, దేవుడు కూడా కొన్ని అవతారాల్లో తనంతట తాను అవతరించిన తర్వాత అమ్మకే పుట్టాడు, అమ్మ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని పొందాడు. అలాటి ఒక అవతారమే "వేద వ్యాసుడి" అవతారం. అయితే, గర్భం దాల్చిన ఆడవారు శిశువుని తొమ్మిది నెలలు మోసే కొద్దీ ఆ బరువు వెన్నుపై పడీ, వెన్ను నొప్పితో మొదలయ్యి వారి శరీరం ఎన్నో నొప్పులను భరించాల్సి వస్తుంది. ఇక ప్రసవ వేదనని కొలిస్తే, యాభై ఏడు డెల్స్ వరకు నొప్పి ఉంటుందట. అంటే, దాదాపు ఒక ఇరవై ఎముకలు ఒకేసారి విరిగినంత నొప్పిని భరించడం. ఈ కొలతలు మనం కనిపెట్టని రోజుల్లోనే "వాయు పురాణం"లో పదహారు శ్లోకాల్లో వేదవ్యాసుడు ఒక ఆడది, "తల్లి అయ్యే తొమ్మినెలల క్రమంలో", పడే వేదనని వర్ణించాడు. విష్ణురూపం ఐన వ్యాసుడు ఇది రాయటానికే తల్లి గర్భం నుంచి వచ్చాడా అనిపిస్తుంది. ఆ శ్లోకాలని ఈ పుస్తకంలో చాగంటి కోటేశ్వర రావు గారు సులువుగా వివరించారు, దానికి బాపు గారు బొమ్మలు సమకూర్చారు. ఈ పుస్తకాన్ని ఒక్కసారైనా చదవాల్సిందే.

Picture of the product
Lumens

Free

PDF (27 Pages)

Matruvandanam

E-Books | Telugu